: జాట్లకు మల్లికా షెరావత్ విజ్ఞప్తి


ఓబీసీ రిజర్వేషన్ల కోసం హర్యానాలో జాట్లు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవడంతో పలువురు బాలీవుడ్ నటులు, క్రికెటర్లు వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆందోళనను శాంతియుతంగా కొనసాగించాలని అంతకుముందు బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా జాట్లను కోరారు. తాజాగా బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కూడా వారికి ఇదేవిధమైన సూచన చేసింది. "శాంతియుతంగా, అహింసాయుతంగా ముందుకు సాగాలని జాట్ కమ్యూనిటీకి విజ్ఞప్తి చేస్తున్నా" అని మల్లిక ట్వీట్ చేసింది. అన్నట్టు, హర్యానాలో పుట్టిన మల్లిక కూడా జాట్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే!

  • Loading...

More Telugu News