: నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాదుకు చోటు


ప్రపంచంలో ఉన్న అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో మన హైదరాబాదుకు 138 స్థానం లభించింది. దాంతో పాటు పూణే (145), ముంబయి (152), ఢిల్లీ (154) నగరాలు కూడా చోటును సంపాదించుకున్నాయి. నాణ్యమైన జీవనానికి అనుగుణమైన నగరాలు ఏవంటూ 'మెర్సెర్' అనే సంస్థ ఇటీవల ఓ సర్వే చేసి, మొత్తం 230 నగరాలతో జాబితా విడుదల చేసింది. ఇందులో మొదటి స్థానంలో ఆస్ట్రియా రాజధాని వియన్నా, తరువాత క్రమంలో స్విట్జర్లాండ్ లోని జురిచ్, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్, జర్మనీలోని మ్యూనిచ్, కెనడాలోని వేంకోవర్ నిలిచాయి. ఈ జాబితాలో వియన్నా వరుసగా ఏడోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News