: స్నేహితులతో కలసి బీచ్ లో ఛార్మీ సందడి
ప్రముఖ నటి ఛార్మీ ప్రస్తుతం హాలిడే ఏంజాయ్ చేస్తోంది. సన్నిహితులతో కలిసి టూరిస్ట్ డెస్టినేషన్ కు వెళ్లిన ఛార్మీ ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులను పలకరిస్తోంది. సన్నిహితులతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ, బీచ్ ను ఎంజాయ్ చేస్తున్నానని ఫేస్ బుక్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా తీసుకున్న పలు ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 'బెస్ట్ బడ్డీస్ తో బీచ్ బేబీ' అంటూ తన గురించి అభిమానులకు కొత్తగా పరిచయం చేసుకుంది. బీచ్ ఒడ్డున చార్మీ దిగిన ఫోటోలను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు.