: 'ఫ్రీడమ్ 251'పై సెటైర్ ...'ఫ్రీడమ్ 651'!


రింగింగ్ బెల్స్ సంస్థ 'ఫ్రీడమ్ 251' పేరిట అత్యంత చౌకధరలో స్మార్ట్ ఫోన్ ను ఆఫర్ చేయడంతో ఇదెలా సాధ్యమంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. అయితే, కొందరు ఔత్సాహికులు మాత్రం ఈ ఆఫర్ పై సెటైర్ వేస్తూ 'ఫ్రీడమ్ 651' అంటూ వెరైటీ ప్రచారానికి దిగారు. అంతేకాదు, అందుకోసం ఓ వెబ్ సైట్ కూడా తెరచారు. 'డజ్ నాట్ రింగ్ బెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట వచ్చిన కొత్త వెబ్ సైట్ (www.freedom651.com) ఇది. ఇంతకీ, ఈ వెబ్ సైట్ ఇస్తున్న ఆఫర్ ఏంటో తెలుసా? రూ. 651 చెల్లిస్తే, అంగారకుడి పైకి పంపుతారట. మరి ఎలాగంటారా? శివకాశీలో తయారైన రాకెట్లకు కట్టి. ఇక 'డోంట్ బై నౌ' అన్న లింక్ పై క్లిక్ చేస్తే, తాత, ముత్తాతల వివరాలు, ఇరుగు పొరుగు వివరాలు అడిగేలా వెబ్ సైట్ ను తయారు చేశారు. ఇక ఇవన్నీ నింపిన తరువాత 'ఆర్డర్ నౌ అండ్ ఫర్ గెట్' అన్న బటన్ కనిపిస్తుంది. కస్టమర్ కేర్ నంబర్ 420-420420 అని ఉంచారు. ఫ్రీడమ్ 251కు పేరడీగా తయారైన ఈ వెబ్ సైట్ ను చూసిన వారంతా కాసేపు నవ్వుకుంటున్నారు.

  • Loading...

More Telugu News