: ప్రపంచంలో అతిపెద్ద బియ్యం బస్తా...ఇండియా గేట్ బాస్మతీ రైస్
భారతదేశానికి చెందిన బియ్యం బస్తా గిన్నిస్ రికార్డు పుటలకెక్కింది. అరటన్నుకు పైగా బరువు కలిగిన బియ్యాన్ని ఈ బస్తాలో నింపడంతో అది రికార్డు పుటల్లో చోటుదక్కించుకుంది. మన దేశానికి చెందిన ఇండియా గేట్ క్లాసిక్ బాస్మతీ రైస్ బస్తా 'గల్-2016'లో రికార్డు సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లర్లైన ఇండియా గేట్ క్లాసిక్ రైస్ బ్రాండ్ వ్యాపారులు 550 కేజీల బాస్మతీ రైస్ ను పాలిధీన్ బ్యాగులో నింపి ఈ రికార్డు నెలకొల్పారు. ఈ బస్తాను ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు దుబాయ్ లో జరుగుతున్న గల్-2016 ప్రదర్శనలో ఉంచారు. ఈ ఫెస్టివల్ ముగిసిన తరువాత ఏదైనా షాపింగ్ మాల్ లో కానీ, రిటైల్ షాపులో కానీ కొంత కాలం ఉంచుతారు. అనంతరం ఈ బియ్యాన్ని కార్మికులకు పంపిణీ చేస్తారు.