: మార్చి 5 మధ్యాహ్నం నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాలు ఆరంభమవుతాయని శాసనసభ సచివాలయం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కౌన్సిల్ సమావేశం కూడా అదే రోజు ప్రారంభమవుతుందని ఉత్తర్వుల్లో తెలిపింది. మార్చి 10న శాసనసభలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాలను విజయవాడలో నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నా సరైన వేదిక లభించకపోవడంతో హైదరాబాదులోనే నిర్వహిస్తున్నారు.