: టీఆర్ఎస్ లో చేరిన బస్వరాజు సారయ్య
తెలంగాణ కాంగ్రెస్ నుంచి మరో ప్రముఖ నేత వైదొలగారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ గూటికి చేరారు. కొద్దిసేపటి కిందట సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన సారయ్యకు గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు, సారయ్య అనుచరులు పాల్గొన్నారు.