: చంద్రబాబూ, ఇప్పుడు చెప్పు నీ సమాధానం!: తలసాని శ్రీనివాస్ యాదవ్


ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబునాయుడు, గతంలో తమపై చేసిన విమర్శలకు ఇప్పుడు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాము టీఆర్ఎస్ లో చేరినప్పుడు ఆయన మాట్లాడిన భాషతో తమకు ఎంతో బాధ కలిగిందన్నారు. తాను చేస్తే నీతి, ఇతరులు చేస్తే అవినీతా? అని ప్రశ్నించిన తలసాని, పార్టీలో చేరిన వాళ్లతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళతారో, లేదో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. తన నిజస్వరూపాన్ని చంద్రబాబు బయటపెట్టుకుంటున్నారని, జరుగుతున్న పార్టీ ఫిరాయింపులను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News