: భూమా టీడీపీలో చేరడం వల్ల శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది: రోజా
ఎప్పటినుంచో వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె టీడీపీలో చేరడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. భూమా టీడీపీలో చేరడం వల్ల పైలోకంలో ఉన్న ఆయన భార్య శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. శోభ చనిపోయాక ఏపీ శాసనసభలో ప్రభుత్వం కనీసం సంతాపం కూడా ప్రకటించలేదని విమర్శించారు. మరిప్పుడు అదే పార్టీలోకి ఆమె కుటుంబ సభ్యులు వెళ్లడం దారుణమన్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి గెలవాలని రోజా డిమాండ్ చేశారు. ఎంతమంది చేరితే అంత తొందరగా టీడీపీ మునిగిపోతుందని, తెలంగాణలో బాబుపై నమ్మకం లేకే ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్ లోకి వెళ్లారని మీడియా సమావేశంలో రోజా విమర్శించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్ అవినీతిలో డబుల్ డిజిట్ సాధించారని ఆమె ఆరోపించారు.