: ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు... * దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రభుత్వం కృషి. * సబ్ కే సాథ్, సబ్ కా వికాస్ మా నినాదం. * యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వ పథకాలు. * అందరికీ నివాసం, ఆహారానికి పెద్దపీట. * జన్ ధన్ యోజన ప్రపంచంలోనే మంచి ఆర్థిక వృద్ధి పథకం. * పేదరిక నిర్మూలన నా ప్రభుత్వ ధ్యేయం. * ప్రజలకు భరోసాను ఇచ్చేలా ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. * జీవన్ జ్యోతి, అటల్ బీమా యోజనలు విజయవంతం. * రూ. 24,600 కోట్లతో పట్టణ గృహ నిర్మాణ పథకం. * ఆహార భద్రత ద్వారా 68 కోట్ల మందికి ప్రయోజనం. * గ్రామీణ పేదల్లో 50 లక్షల మందికి కొత్తగా వంట గ్యాస్ కనెక్షన్లు. * సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధికి తొలి ప్రాధాన్యం. * మైనారిటీల బడ్జెట్ లో 50 శాతం ఉపకార వేతనాలకే. * రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతోముఖాభివృద్ధి. * రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టిన కేంద్రం. * తక్కువ ప్రీమియంతోనే పంటల బీమా ద్వారా రైతులకు భరోసా. * భూసార పరీక్షా కార్డుల పంపిణీ. * వేలాది క్లస్టర్ల ద్వారా ప్రకృతి వ్యవసాయం. * రైతులకు గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెట్లు * ఈ-మార్కెట్ల ద్వారా ఎక్కడైనా దిగుబడిని అమ్ముకునే అవకాశం. * ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త యూరియా పథకం వినూత్నం * దీనిద్వారా వచ్చే మూడేళ్లలో 17 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి. * యూరియాకు వేప పూత వల్ల రైతులకు ప్రయోజనం. * గ్రామీణాభివృద్ధిలో భాగంగా పాల ఉత్పత్తికి మరింత ప్రోత్సాహం. * కోళ్లు, మత్య్స పరిశ్రమలకు కూడా ప్రోత్సాహకాలు. * రైతుల అభ్యున్నతికి 109 కిసాన్ వికాస్ కేంద్రాలు. * ఐదు మెగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం. * గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో పనులు. * మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర ద్వారా అపార ఉపాధికి అవకాశాలు. * మేకిన్ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు. * ముద్రా యోజన ద్వారా ఔత్సాహిక మహిళలకు ఇతోధిక రుణాలు. * నీతి ఆయోగ్ లో రాష్ట్రాలకు మరింత వాటా. * పీపీపీ విధానంలో 500కు పైగా ఈ-గవర్నెన్స్ సేవలు. * సాధ్యమైనన్ని ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల కల్పన. * అవినీతికి ఆస్కారం లేని పాలనే లక్ష్యం. * మౌలిక వసతుల కల్పనకు ఎనలేని ప్రాధాన్యం. * స్మార్ట్ సిటీల అభివృద్ధి కొంత సవాలే, అయినా వెనక్కు తగ్గం. * క్లీన్ ఎనర్జీకి మరిన్ని నిధులు, ప్రత్యామ్నాయ ఇంధనానికి ప్రోత్సాహం. * 2022 నాటికి 175 గిగావాట్ల ప్రత్యామ్నాయ ఇంధన లక్ష్యం. * సౌర, పవన విద్యుత్ ప్లాంట్లకు మరిన్ని రాయితీలు. * విద్యుత్ కొరత లేని దేశంగా ఇండియా మారాలి. * మే 2018 నాటికి అన్ని మారుమూల గ్రామాలకూ విద్యుత్. * దక్షిణాదిలో 71 శాతం పెరిగిన విద్యుత్ ఉత్పత్తి. * త్వరలోనే 'వన్ నేషన్ - వన్ గ్రిడ్ - వన్ ప్రైస్' కల సాకారం. * వీధి దీపాలన్నీ ఎల్ఈడీ బల్బులతో మార్చే పనులు శరవేగం. * రూ. 300 నుంచి రూ. 64కు తగ్గిన ఎల్ఈడీ బల్బుల ధరలు. * సంస్కరణల అమలుకు అన్ని రాష్ట్రాలూ సహకరించాలి.