: ఇక హరీశ్ వంతు!... ఏరియల్ సర్వేలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ మంత్రి
కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీఎం హోదాలో మొన్నటిదాకా ఏరియల్ సర్వేలతో అదరగొట్టారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూముల పరిశీలన కోసమంటూ హెలికాఫ్టర్ ఎక్కిన కేసీఆర్, ఏరియల్ సర్వేలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు రంగంలోకి దిగారు. తన సొంత జిల్లా మెదక్ లోని నారాయణ్ ఖేడ్ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో రికార్డు విజయాన్ని రాబట్టగలిగిన హరీశ్ రావు... నేటి ఉదయం మామ తరహాలోనే హెలికాఫ్టర్ ఎక్కారు. సింగూరు జలాశయం పరిశీలన కోసమంటూ హెలికాఫ్టర్ ఎక్కిన హరీశ్ రావు జలాశయంపై ఏరియల్ సర్వే నిర్వహించారు.