: భూమితో కాంటాక్టులో లేని వేళ వ్యోమగాములతో 'వూ' అన్నదెవరు?... 46 ఏళ్ల నాటి మిస్టరీ టేపులు విడుదల చేసిన నాసా!


అది మే, 1969... అపోలో 10 వ్యోమనౌకలో థామస్ స్టాఫోర్డ్, జాన్ యంగ్, యూజీన్ సెర్నన్ లు చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్నారు. చంద్రుడికి ఆవలివైపున వెళ్లినప్పుడు వారికి భూమితో ఎటువంటి రేడియో కాంటాక్టూ ఉండదు. ఏదైనా సమాచారం ఇచ్చి పుచ్చుకోవాలంటే, చంద్ర పరిభ్రమణం తరువాత, భూమి కనిపించేలా ముందుకు వస్తేనే మాట్లాడే అవకాశం. ఆ సమయంలో వారికి ఓ వింత శబ్దం వినిపించింది. అది రికార్డయింది కూడా. 'వూ...' అంటూ వచ్చిన ఆ వింత ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇప్పటికీ మిస్టరీయే. ఈ వింత ధ్వని గురించిన సమాచారం 2008లో తొలిసారిగా బయటకు రాగా, ఇప్పుడు ఆ ధ్వనిని నాసా విడుదల చేసింది. కొంతమంది దీన్ని ఏలియన్ల సంగీతమని, మరికొందరు ఏదో డిస్ట్రబెన్స్ కారణంగా రికార్డయిందని చెబుతున్నారు. ఇక అపోలో 11 పర్యటనలో భాగంగా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను తీసుకెళ్లిన పైలట్ మైఖేల్ కోలిన్స్ సైతం ఇవే తరహా శబ్దాలను తాను కూడా విన్నానని చెప్పడం గమనార్హం. నిన్న నాసా విడుదల చేసిన ఈ వీడియోను ఇప్పటికే 13.67 లక్షల మంది వీక్షించారు.

  • Loading...

More Telugu News