: రెండు కేబినెట్ పోస్టులు, ఒకరికి కేసుల్లో సహకారం... టీడీపీ ‘ఆకర్ష్’పై జగన్ పత్రిక కథనం
ఏపీలో అధికార పార్టీ చేపట్టిన ‘ఆకర్ష్’పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని రాసింది. నిన్న విజయవాడ కేంద్రంగా జరిగిన చేరికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై నేటి తన సంచికలో ‘సాక్షి’ ప్రధాన శీర్షికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రెండు కేబినెట్ పోస్టులను ఎరగా వేసిన టీడీపీ, ఓ నేతకు కేసుల్లో సహకారం అందిస్తామని హామీ ఇచ్చిందని పేర్కొంది. వీటితో పాటు పెద్ద మొత్తంలో డబ్బు, కాంట్రాక్టులు, లైసెన్సులు, కేసుల ఎత్తివేత వంటి పలు హామీలను ఇచ్చి, వైసీపీ నేతలను తనలో చేర్చుకుందని విమర్శనాత్మక కథనాన్ని రాసింది.