: ఎట్టకేలకు జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్... తాజా రాజకీయాలను ప్రస్తావించనున్న వైసీపీ అధినేత
నిన్ననగా హస్తిన వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ రోజంతా ఖాళీగానే గడిపారు. తన బాబాయ్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాసానికే పరిమితమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపుల కోసమంటూ ఢిల్లీలో కాలు మోపిన జగన్... రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో వరుస భేటీలు నిర్వహించాలని తలచారు. అయితే ఆయనకు ఏ ఒక్కరి అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో బాబాయ్ ఇంటికే పరిమతమైన జగన్ నేడు రాష్ట్రపతితో భేటీకి ఎట్టకేలకు అపాయింట్ మెంట్ దక్కించుకున్నారు. నేటి సాయంత్రం రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్న జగన్, ప్రణబ్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక కేటాయింపులపైనే కాక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించనున్నట్లు సమాచారం.