: ఈ నెల 25న సంజయ్ దత్ విడుదల


బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ పూణేలోని ఎరవాడ జైలు నుంచి ఈ నెల 25న విడుదల కానున్నాడు. అక్రమ ఆయుధాల కేసులో దోషిగా రుజువైన సంజయ్ దత్ ఐదేళ్ల జైలు శిక్ష ముగించుకుని విడుదల కానున్నాడు. 1993 మార్చి 12న ముంబైలో సంభవించిన వరుస పేలుళ్ల కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో సంజయ్ దత్ ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం అతనికి ఐదేళ్ల శిక్ష విధించింది. దీనిపై సంజయ్ దత్ కుటుంబం ఎంతో పోరాటం చేసింది. సంజయ్ ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు వారు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే న్యాయస్థానం మాత్రం సంజయ్ దత్ అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం నేరమేనని స్పష్టం చేసింది. దీంతో ఐదేళ్ల శిక్ష విధించింది. ఈ శిక్షాకాలం ఈ నెల 25తో ముగియనుందని జైలు అధికారులు తెలిపారు. 25న ఉదయం 9 గంటలకు సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కానున్నాడని, అతనిని తీసుకెళ్లేందుకు భార్య మాన్యత, పిల్లలు రానున్నారని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News