: అవకాశవాదిని కాను... చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటా: రామసుబ్బారెడ్డి
తాను అవకాశవాదిని కానని జమ్మలమడుగు ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేడర్ సమస్యలు ముఖ్యమంత్రికి వివరించానని అన్నారు. జమ్మలమడుగులో పార్టీ కేడర్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని, అన్ని వేళలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని తాను పదవిని ఆశించడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. అలాగే తనపై నమ్మకంతో ఆయన ఏ బాధ్యత అప్పగించినా దానిని నిర్వర్తిస్తానని ఆయన చెప్పారు. తాము పార్టీలో కొత్తగా చేరిన వాళ్లం కాదని, పార్టీని నమ్ముకుని ఎంత కాలంగా ఉన్నామో ముఖ్యమంత్రికి తెలుసని ఆయన తెలిపారు.