: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల చేరికను స్వాగతిద్దాం: కార్యకర్తలతో చంద్రబాబు
టీడీపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డిల చేరికను స్వాగతిద్దామని జమ్మలమడుగు, నంద్యాల నియోజకవర్గాల కార్యకర్తలతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాస్సేపటి క్రితం ఆయా నియోజకవర్గాల కార్యకర్తలతో బాబు భేటీ అయ్యారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్టీ చూసుకుంటుందని కార్యకర్తలకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ భేటీలో టీడీపీ నేతలు రామసుబ్బారెడ్డి, శిల్పా సోదరులు పాల్గొన్నారు.