: వైసీపీ ఎమ్మెల్యే వర్గీయులు మా పెదనాన్నను చంపారు: రామసుబ్బారెడ్డి
జమ్మలమడుగు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వర్గీయులు తమ పెదనాన్నను చంపారని, టీడీపీ కార్యకర్తలను వేధించారని తెలుగుదేశం పార్టీ నేత రామసుబ్బారెడ్డి అన్నారు. ఈరోజు సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆయన విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కార్యకర్తల మనోభావాలను చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు. అయితే, తన తుది శ్వాస వరకు చంద్రబాబుతోనే ఉంటామని రామసుబ్బారెడ్డి చెప్పారు.