: ఎపిసోడ్ కి 1.25 కోట్ల రూపాయలు తీసుకుంటున్న బాలీవుడ్ నటి


సినిమా ఆఫర్లు తగ్గిన తరువాత బాలీవుడ్ నటీమణులు బుల్లితెరవైపు చూస్తుంటారు. అలా బుల్లితెరపై మాధురీ దీక్షిత్, సోనాలీ బెంద్రే, శిల్పాశెట్టి, తనీషా, ఇషా డియోల్ వంటి తారలు తళుక్కున మెరిశారు. వీరి జాబితాలో ప్రముఖ నటి రవీనా టాండన్ కూడా మరోసారి చేరుతోంది. అయితే వారందరి కంటే ఎక్కువగా రికార్డు స్థాయి పారితోషికంతో రవీనా బుల్లితెరపై మెరవనుండడం విశేషం. 'వీ' ఛానెల్ లో ప్రసారం కానున్న 'షైన్ ఆఫ్ ఇండియా' షోలో ఆమె జడ్జ్ గా కనిపించనుంది. ఈ ప్రోగ్రాంలో ఒక ఎపిసోడ్ కి ఆమె 1.25 కోట్ల రూపాయల చొప్పున పారితోషికం అందుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అమితాబ్ బచ్చన్ (కౌన్ బనేగా కరోడ్ పతి), షారూఖ్ ఖాన్ (కౌన్ బనేగా కరోడ్ పతి), అమీర్ ఖాన్ (సత్యమేవ జయతే), సల్మాన్ ఖాన్ (బిగ్ బాస్) అక్షయ్ కుమార్ (ఖత్రోంకా ఖిలాడీ)లతో రవీనా పోటీ పడుతున్నట్టు కనబడుతోంది.

  • Loading...

More Telugu News