: ఈ ఏడాది వరకు నీటి కరవు తప్పదు: మంత్రి హరీశ్ రావు
ఈ ఏడాది వేసవి వరకు నీటి ఎద్దడి తప్పదని తెలంగాణ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఏడాది నుంచి నీటి సమస్యను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పర్యావరణ, అటవీ అనుమతుల జాప్యం కారణంగానే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతోందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఉమా భారతి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సాయం లభించడం లేదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.