: నార్త్ బ్లాక్... అదో రహస్య ప్రపంచం... 'బడ్జెట్' వేస్తున్నది అక్కడే!


బడ్జెట్‌ రూపకల్పన అత్యంత గోప్యంగా, శరవేగంగా సాగుతోంది. న్యూఢిల్లీ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లోని నార్త్‌ బ్లాక్‌ బేస్‌మెంట్‌ లో ఉన్న ముద్రణా కార్యాలయంలో ఎంపిక చేసిన కొందరు అత్యంత నమ్మకమైన అధికారుల నేతృత్వంలో అన్ని నెట్‌ వర్క్‌ లింకులూ తొలగించబడ్డ కంప్యూటర్లపై పని సాగుతోంది. అన్ని ప్రతిపాదనలతో కూడిన బడ్జెట్‌ సీడీ నేడో, రేపో ముద్రణకు రానుంది. ఇక ప్రింటింగ్‌ పనిలో నిమగ్నమైవున్న అందరు సాంకేతిక అధికారులు, లీగల్‌ అధికారులు, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారులు, నార్త్‌ బ్లాక్‌ లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది అంతా ఎవరూ బయటకు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తారు. అక్కడే తిని, అక్కడే విశ్రమించే వీరంతా ఆర్థికమంత్రి లోక్‌ సభ లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరమే బయటకు వస్తారు. వీరికి మొబైల్ ఫోన్‌ సౌకర్యమూ ఉండదు. ఇక బడ్జెట్ పుస్తకాల ముద్రణ పూర్తయిన తరువాత వాటిని అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతారు. మంత్రివర్గ సహచరులకు ఈ బడ్జెట్‌ ప్రతులు కేవలం 10 నిమిషాల ముందు మాత్రమే అందుతాయి.

  • Loading...

More Telugu News