: మోదీ సభలో కలకలం, నినాదాలు చేసిన విద్యార్థిని చావగొట్టిన బీజేపీ కార్యకర్తలు!
మోదీ వారణాసిలో పర్యటిస్తున్న వేళ కలకలం చెలరేగింది. ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన అనంతరం, బీజేపీకి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన బనారస్ హిందూ యూనివర్శిటీ విద్యార్థిని బీజేపీ కార్యకర్తలు చావగొట్టారు. దేశంలో విద్యార్థులపై నమోదవుతున్న దేశద్రోహం కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఈ తరహా పాలన కూడదని అశుతోష్ సింగ్ నినాదాలు చేయగా, అతన్ని చుట్టుముట్టిన బీజేపీ కార్యర్తలు కొట్టారు. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. నినాదాలు చేస్తున్న అశుతోష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాతనే బీజేపీ కార్యకర్తలు దాడి చేసినట్టు తెలుస్తోంది. గత నెలలో లక్నోలోని అంబేద్కర్ యూనివర్శిటీలో ప్రధాని ప్రసంగించిన సమయంలోనూ ఇదే తరహాలో విద్యార్థులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.