: టీ కాంగ్రెస్ కు షాక్ తప్పదా?... గులాబీ గూటికి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య


తెలంగాణలో టీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురు మినహా మిగిలిన వారంతా ‘గులాబీ’ గూటికి చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరుతున్నారని టీఆర్ఎస్ అనధికారికంగానే అయినా, సంచలన ప్రకటనే చేసింది. ఆ ప్రకటన కూడా కార్యరూపం దాలిస్తే... టీ టీడీపీకి ఇక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారు. వారు కూడా తాము వద్దనుకున్న ఎమ్మెల్యేలేనని టీఆర్ఎస్ ప్రకటించింది. టీ టీడీపీ ఖాళీ అయిన ప్రస్తుత తరుణంలో టీఆర్ఎస్ తాజాగా టీ కాంగ్రెస్ వైపు దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్యపై వల విసిరింది. ఈ వలకు సారయ్య చిక్కినట్లే వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్ లో చేరేందుకు సారయ్య ఆసక్తిగానే ఉన్నట్లు సమాచారం. రేపు తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారన్న వార్తలు తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News