: మోదీ కేబినెట్ లో టీఆర్ఎస్ చేరికా?... సమాచారం లేదంటున్న దత్తన్న


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో దాదాపు అరగంటకు పైగా ఏకాంత భేటీ నిర్వహించారు. పార్టీ నేతలను వదిలేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను వెంటబెట్టుకుని ప్రధాని నివాసానికి వెళ్లిన కేసీఆర్, రిసెప్షన్ లోనే రాజీశ్ శర్మను కూర్చోబెట్టి తాను ఒక్కరు మాత్రమే ప్రధాని వద్దకు వెళ్లారు. అరగంటకు పైగా జరిగిన ఈ భేటీపై నాడు పెద్ద చర్చే జరిగింది. అయితే దీనిపై అటు మోదీ గాని, ఇటు కేసీఆర్ గాని నోరు మెదపకపోవడంతో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడక తప్పలేదు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం బీజేపీ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర కేబినెట్ లో టీఆర్ఎస్ చేరుతోందా? అంటూ ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే... దీనిపై ప్రధాన మంత్రి లేదా ముఖ్యమంత్రే స్పందించాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News