: ఢిల్లీ బయలుదేరిన వైఎస్ జగన్... కాసేపట్లో కీలకాంశాలపై, రాష్ట్రపతి, ప్రధానితో భేటీ


ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి ఉదయం దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, బడ్జెట్ నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు తదితరాలపై ఆయన ప్రధానితో చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఇటీవల రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన కాపులకు రిజర్వేషన్లు, కాపు గర్జన హింస పేరిట పోలీసులు నమోదు చేసిన కేసుల ఉపసంహరణ తదితర కీలక అంశాలనూ ఆయన ఈ భేటీల్లో ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు షెడ్యూల్ లేకుండా, ఉన్నపళంగా జగన్ డిల్లీ పర్యటనకు బయలుదేరిన వైనంపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News