: ఆస్తులమ్మి బకాయిలు చెల్లించండి... 7 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ఆందోళనలు


తమ డబ్బుతో అక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులను తెగనమ్మి తమ డిపాజిట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని అగ్రిగోల్డ్ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేటి నుంచి ఏడు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన బాధితులు ఆందోళనలను చేపట్టనున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై ఏపీ సీఐడీ దూకుడు పెంచడం, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కూడా ఈ కేసు విచారణపై ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో నిన్నటిదాకా కాస్తంత సైలెంట్ గానే ఉన్న బాధితులు నేటి నుంచి స్వరం పెంచనున్నారు. నేటి నుంచి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో వినూత్న ఆందోళనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాల కలక్టరేట్ల ముందు బాధితులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగనున్నారు.

  • Loading...

More Telugu News