: సొంతూళ్లో నేడు చిరంజీవి పర్యటన... దత్తత గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం


టాలీవుడ్ ప్రముఖ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి నేడు తన సొంతూళ్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తన సొంతూరు మొగల్తూరు వెళ్లనున్న చిరంజీవి... అక్కడి నుంచి తాను దత్తత తీసుకున్న పేరుపాలెం గ్రామానికి ర్యాలీగా బయలుదేరతారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద రాజ్యసభ సభ్యుడి హోదాలో ఆయన పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం ఆయన ఇటీవలే తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.5 కోట్లను కేటాయించారు. సదరు అభివృద్ధి పనులకు నేడు చిరంజీవి శ్రీకారం చుట్టనున్నారు. చిరు పర్యటన నేపథ్యంలో మొగల్తూరు, పేరుపాలెంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News