: నా జీవితంలో ఆ ముగ్గురి గురించి చెప్పుకోవాలి : సునీల్


మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత దిల్ రాజు, హీరో రవితేజ ఈ ముగ్గురిని తన జీవితంలో మర్చిపోలేనని హీరో సునీల్ అన్నాడు. ఆ ముగ్గురు తనను అన్ని విధాలా ప్రోత్సహిస్తారని చెప్పాడు. తనకు సపోర్టర్, మెంటర్, ఫ్రెండ్..అన్నీ త్రివిక్రమ్ శ్రీనివాసేనని అన్నాడు. దిల్ రాజు గురించి చెప్పాలంటే .. తాను ఇబ్బంది పడుతున్న రోజుల నుంచి ఇప్పటి దాకా ఆయనతో తన ప్రయాణం కొనసాగుతోందని.. తాను ఏ పరిస్థితిలో ఉన్నా తమ మధ్య అనుబంధం ఒకేలా ఉందని, ఆయన దగ్గర తనకు స్వతంత్రం ఎక్కువని చెప్పాడు. ఇక రవితేజ అయితే.. ఎప్పుడూ ఉత్సాహపరుస్తూ ఉంటాడని, తాను డల్ గా ఉంటే కనుక రవితేజ దగ్గరకు వెళతానని.. హుషారుగా తిరిగి వస్తానని సునీల్ తన మనసులోని మాటలను చెప్పాడు.

  • Loading...

More Telugu News