: నా సిక్స్ ప్యాక్ మూడేళ్ల కృషి: హీరో సునీల్
'అందాల రాముడు' చిత్రంలో సిక్స్ ప్యాక్ కోసం మూడేళ్ల పాటు కృషి చేశానని హీరో సునీల్ అన్నాడు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. ఆ చిత్రంలో సునీల్ ప్రదర్శించిన సిక్స్ ప్యాక్ నిజమైంది కాదు, గ్రాఫిక్స్ మాయ అంటూ జరిగిన ప్రచారంపై ప్రశ్నించినప్పుడు, సునీల్ పైవిధంగా స్పందించాడు. తనను సిక్స్ ప్యాక్ లో చూపించడం కోసం గ్రాఫిక్స్ ను ఉపయోగిస్తే కనుక దానికి అయ్యే ఖర్చుతో ఒక హాలీవుడ్ సినిమా తీయవచ్చని చెప్పాడు. అంత ఖర్చు ఎవరు భరిస్తారని అన్నాడు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, సిక్స్ ప్యాక్ కోసం బాగా కష్టపడ్డానని, గ్రాఫిక్స్ అని ఒక్కమాటలో కొట్టిపారేయడం కరెక్టు కాదని సునీల్ అన్నాడు.