: అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాదీ విద్యార్థి దుర్మరణం


అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లిన మరో హైదరాబాదీ విద్యార్థి దుర్మరణం చెందాడు. హైదరాబాదులోని తార్నాకకు చెందిన జాయ్ నియోల్ మాథ్యూస్ కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ విద్య కోసం అమెరికాలోని అలబామాకు వెళ్లాడు. అక్కడి అన్నా ట్రాయ్ స్టేట్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. ఈ క్రమంలో నిన్న అలబామాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన మాథ్యూస్ చనిపోయాడు. దీంతో హైదరాబాదులోని జాయ్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.

  • Loading...

More Telugu News