: సుజనా చౌదరికి హైకోర్టు ఝలక్... ‘మారిషస్’ వ్యవహారంలో సమన్లు జారీ
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఝలకిచ్చింది. మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను సుజనా కంపెనీ చెల్లించని విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇచ్చిన రుణాన్ని వసూలు చేసుకునేందుకు మారిషస్ బ్యాంకు కోర్టుకెక్కిన సంగతీ విదితమే. ఈ వ్యవహారంలో మారిషస్ బ్యాంకు దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు సుజనాకు షాకిచ్చింది. వచ్చే నెల (మార్చి) 5న జరగనున్న విచారణకు హాజరుకావాలని సుజనాకు కోర్టు నిన్న సమన్లు జారీ చేసింది. నిన్నటిదాకా కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాని పక్షంలో కాస్తంత నెమ్మదిగానే ఉన్న సుజనా, తాజాగా సమన్లు జారీ కావడంతో ఏం చేస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది.