: యూరోప్ కి అతిపెద్ద ముప్పు...శరణార్థుల రూపంలో 5000 మంది ఐసిస్ తీవ్రవాదులు


యూరోప్ కి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని యూరప్ పోలీస్ ఏజెన్సీ (యూరోపోల్) హెచ్చరించింది. వివిధ యుద్ధ ప్రాంతాల్లో కఠోర శిక్షణ పొందిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు సుమారు 5,000 మంది యూరోప్ చేరుకున్నారని యూరోపోల్ తెలిపింది. యూరోప్ కు ఈ దశాబ్దంలోనే అతి పెద్ద ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఇస్లామిక్ స్టేట్, ఇతర ఉగ్రవాద గ్రూపులు యూరోప్ పౌరసమాజంపై విరుచుకుపడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని యూరోపోల్ సూచించింది. పారిస్ లో చోటుచేసుకున్న దాడులు మరోసారి యూరోప్ ఎక్కడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని యూరోపోల్ డైరెక్టర్ రోబ్ వైన్ రైట్ తెలిపారు. సిరియా వలసవాదుల ముసుగులో ఉగ్రవాదులు యూరోప్ లో భారీ ఎత్తున ప్రవేశించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News