: ఆ నరేశ్ వదిలేసిన కామెడీతో నేను లాగిస్తున్నా!: అల్లరి నరేశ్
'గుంటూరు టాకీస్' సినిమా ఆడియో వేడుక హైదరాబాదులో జరుగుతోంది. ఈ సందర్భంగా కొన్ని పాటలకు హీరోయిన్లు శ్రద్ధా దాస్, 'జబర్దస్త్' ఫేమ్ రష్మి డాన్సులు చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లరి నరేశ్ మాట్లాడుతూ, వారాహి చలన చిత్ర సంస్థ వారు సరికొత్త మార్కెటింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారని కితాబు ఇచ్చాడు. సినిమాలో నటించిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. సీనియర్ నటుడు నరేశ్ వదిలేసిన కామెడీతో తాను లాగిస్తూ, అల్లరి చేస్తున్నానని నరేశ్ చెప్పాడు. ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో రాణించారని నరేశ్ అన్నాడు. ఈ సందర్భంగా సినిమాలోని '420' అనే పాటను ఆయన ఆవిష్కరించాడు.