: ఈ నెల 28న టీడీపీలో చేరనున్న ఎనిమిది మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు?


ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సత్ఫలితాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత నుంచి వారికి స్పష్టమైన సంకేతాలు అందినట్టు సమాచారం. దీంతో ఈ నెల 28న వైఎస్సార్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారు. వీరు ఎవరు? అనే అంశాన్ని టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన వర్గాలు గుట్టుగా ఉంచుతున్నప్పటికీ వీరి చేరిక ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీకి చెందిన భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ టీడీపీలో చేరుతారని నిన్నటి నుంచి వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. గతంలో జలీల్ ఖాన్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, నేతల కంటే కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు మొగ్గుచూపాలని నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News