: గెలుపు ముందు 'స్థానం' ముఖ్యం కాదు: రైనా


బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు రావడమా? వెనక రావడమా? అన్నది జట్టు గెలుపు ముందు ముఖ్యం కాదని ఐపీఎల్ గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా తెలిపాడు. గుజరాత్ లయన్స్ జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా రైనా మాట్లాడుతూ, జట్టు గెలుపు కోసం ఏ స్థానంలో బ్యాటింగ్ కు రావాలన్నా తాను సిద్ధమని అన్నాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చినా జట్టు గెలుపుకోసమే ఆడుతామన్నది గుర్తుంచుకోవాలని చెప్పాడు. టీట్వంటీ వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ లో ఆడనుండడం జట్టుకు లాభిస్తుందని పేర్కొన్నాడు. ఏడాదిన్నర తరువాత పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ కు సరిపడా అవకాశాలు రాలేదని రైనా అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News