: సెల్ ఫోన్ లో లేట్ స్ట్రీమింగ్ వల్ల హార్ట్ బీట్ పెరుగుతుందట!
సెల్ ఫోన్ లో ఆడియో, వీడియో ఫైల్స్ ఓపెన్ చేసినప్పుడు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ లేట్ స్ట్రీమింగ్ కారణంగా తీవ్రమైన ఒత్తిడి కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలా ఒక వీడియో స్ట్రీమింగ్ అయ్యేందుకు ఆరు సెకన్ల సమయం తీసుకుంటే కనుక... పరీక్షలు రాసేటప్పుడు, అర్ధరాత్రి ఒక్కళ్లే కూర్చుని హారర్ సినిమా చూస్తున్నప్పుడు అనుభవించే ఒత్తిడి కలుగుతుందని కమ్యూనికేషన్ టెక్నాలజీ సంస్థ ఎరిక్ సన్ తెలిపింది. ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటే ఎత్తైన కొండ అంచున నిలబడ్డంత ఒత్తిడి కలుగుతుందని వెల్లడించింది. వీడియో ఒకసారి ప్లే అవడం మొదలైన తర్వాత మధ్యలో ఆగిపోతే కనుక, ఈ ఒత్తిడి మరింత పెరుగుతుందని ఆ సంస్థ తెలిపింది. వెబ్ పేజ్ లు, వీడియోలు స్ట్రీమింగ్ లేట్ అయితే 38 శాతం హార్ట్ బీట్ పెరుగుతుందని ఎరిక్ సన్ వెల్లడించింది. ఇలా పదే పదే జరిగితే నెట్ వర్క్ పై అసహనం పెరిగి, వేరే నెట్ వర్క్ కు వినియోగదారుడు మారే అవకాశం ఉందని వారు తెలిపారు.