: భూమా చేరికపై నిర్ణయం తనకే వదిలేయమని చంద్రబాబు చెప్పారు: శిల్పా బ్రదర్స్


భూమా నాగిరెడ్డి చేరికపై నిర్ణయాన్ని తనకు వదిలేయమని, ఏ ఇబ్బంది లేకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు తమతో అన్నారని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం శిల్పా బ్రదర్స్ మీడియాకు తెలిపారు. పార్టీని పటిష్టపరిచేందుకు ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఆ స్వేచ్ఛ తనకివ్వాలని బాబు కోరినట్టు చెప్పారు. అందుకే ముందుగా స్థానిక నేతలైన తమతో మాట్లాడాకే చేరికపై నిర్ణయం తీసుకుందామని ప్రత్యేకంగా పిలిపించానని అన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన హామీతో తామంతా సంతృప్తి చెందామని, మరొకసారి ఈ విషయంపై మాట్లాడదామన్నారని తెలిపారు. ఈ మేరకు ఇవాళ కర్నూలు జిల్లా నేతలతో సమావేశమైన సీఎం చంద్రబాబు దాదాపు రెండు గంటలపాటు అనేక విషయాలపై చర్చించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, శిల్పా బ్రదర్స్ పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News