: వాఘా బోర్డర్లో సందడి చేసిన విరాట్ కోహ్లీ


వాఘా బోర్డర్ లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబంతో సందడి చేశాడు. శ్రీలంకతో జరిగిన టీట్వంటీ సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ, ఆసియాకప్ కు సమయం ఉండడంతో కుటుంబంతో కలసి గడుపుతున్నాడు. పంజాబ్ లోని అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని కుటుంబ సమేతంగా కోహ్లీ సందర్శించాడు. అనంతరం అక్కడికి దగ్గర్లో ఉన్న వాఘా సరిహద్దుల వద్దకు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న పలు ఫోటోలను ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేశాడు. కుటుంబంతో సరదాగా గడపడం సంతోషంగా ఉందని కోహ్లీ చెప్పాడు. వీటికి కోహ్లీ అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News