: ఊహించని ధరను సొంతం చేసుకున్న జేమ్స్ బాండ్ వస్తువులు


'స్పెక్టర్' సినిమాలో జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్ ధరించిన దుస్తుల్ని, వినియోగించిన పలు వస్తువులను క్రిస్టీస్ సంస్థ వేలం వేసింది. ఈ వేలంలో జేమ్స్ బాండ్ వస్తువులు ఊహించని ధరను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాలో జేమ్స్ బాండ్ వినియోగించిన ఆస్టన్ మార్టిన్ డీబీ10 కారుకు 1.4 నుంచి 2.1 మిలియన్ డాలర్ల ధర పలికే అవకాశం ఉందని భావించారు. అయితే దీనికి ఎవరూ ఊహించని విధంగా 3.5 మిలియన్ డాలర్ల ధర పలికింది. ఈ కారును సాధారణ రోడ్లపై నడిపేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ ఈ కారును అత్యధిక ధరకు సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో బాండ్ ధరించిన ఒమేగా వాచ్ 92,500 యూరోలు పలికింది. అలాగే టామ్ ఫోర్డ్ సూట్ 27,500 యూరోలకు, బాండ్ ధరించిన ఒబెర్ హా యూజర్స్ స్పెక్టర్ రింగ్ 32,500 యూరోలకు, జేమ్స్ బాండ్ ధరించిన డెడ్ కాస్ట్యూమ్స్ 98,500 యూరోలకు అమ్ముడుపోయాయని క్రిస్టీస్ వేలం హౌస్ తెలిపింది.

  • Loading...

More Telugu News