: ఆయన రికార్డును అధిగమించానని తెలియదు: మెక్ కల్లమ్


నా ఆదర్శ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ అంటూ చెప్పి ఒక్క రోజూ గడవకముందే మెక్ కల్లమ్ ఆయన పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం. దీనిపై మెక్ కల్లమ్ మాట్లాడుతూ, క్రీజులో ఉన్నప్పుడు అది రికార్డు అన్న విషయం తెలియదని అన్నాడు. క్రీజులో దిగిన దగ్గర్నుంచి బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా ఆడానని చెప్పాడు. ఈ క్రమంలో వివ్ రిచర్డ్స్ పేరిట ఉన్న వేగవంతమైన సెంచరీ, మిస్బావుల్ హక్ పేరిట ఉన్న 56 బంతుల్లో సెంచరీ రికార్డులను అధిగమించానని అన్నాడు. అయితే తన అభిమాన క్రికెటర్ రికార్డు అధిగమించడం ఆనందంగా ఉందని మెక్ కల్లమ్ చెప్పాడు. క్రీజులో దిగినప్పటి నుంచి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మెక్ కల్లమ్ కేవలం 54 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ టెస్టులో 79 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 149 పరుగులు చేశాడు. కాగా, ఈ టెస్టు అనంతరం మెక్ కల్లమ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News