: డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తుల వెల్లువ
సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి 70వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దాంతో కలెక్టర్ కార్యాలయం జనజాతరలా మారింది. దాంతో ఈ నెల 22 నుంచి కార్యాలయానికి రావక్కర్లేకుండా, ఆన్ లైన్ లోనే డబుల్ బెడ్ రూంకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రంగారెడ్డి కలెక్టర్ రఘునందనరావు తెలిపారు. అలాగే, అప్లికేషన్లకు చివరి తేదీ అంటూ ఏదీ లేదని, ఇది నిరంతర ప్రక్రియ అనీ, మీ-సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వెల్లడించారు.