: భూమా టీడీపీలో చేరుతున్నారన్న విషయం నాకు తెలియదు: డిప్యూటీ సీఎం కేఈ
కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరుతున్నారన్న విషయం తనకసలు తెలియదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. టీవీల్లో చూసిన తరువాతే విషయం తెలుసుకున్నామని ఓ తెలుగు ఛానల్ తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. అసలు భూమా కుటుంబంతో కూడా తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఫోన్ చేసి విజయవాడ రమ్మంటే వచ్చామని, కాసేపట్లో భేటీ కాబోతున్నామని తెలిపారు. టీడీపీలో భూమా చేరికపై చంద్రబాబు అడిగితే తమ అభిప్రాయం వెల్లడిస్తామన్నారు.