: ఐపీఎస్ అధికారినంటూ ఎయిర్ బేస్ వివరాలు అడిగిన వ్యక్తి!
ఐపీఎస్ అధికారినని చెబుతూ, గుర్తుతెలియని వ్యక్తి ఎస్పీ కార్యాలయం నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...రాజస్థాన్ లోని బార్మెర్ లోని ఎస్పీ కార్యాలయానికి నిన్న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను జమ్మూకాశ్మీర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారినని చెప్పాడు. తనకు భారత ఎయిర్ ఫోర్స్ బేస్ గురించి కొంత సమాచారం అందించాలని కోరాడని ఎస్పీ పరిస్ దేశ్ ముఖ్ తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించినట్టు ఆయన చెప్పారు. కాగా, పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి అనంతరం అప్రమత్తంగా ఉన్న సమయంలో ఇలాంటి ఫోన్ కాల్ రావడంతో అధికారులు సమగ్ర విచారణ ప్రారంభించారు.