: రెడ్డిగారికి మేడం సీటు ఇస్తారా?


విశాఖపై కన్నేసిన పారిశ్రామికవేత్త సుబ్బరామిరెడ్డి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఫలితాన్ని ఇస్తున్నట్టే కనిపిస్తోంది. 'వైజాగ్ నాది' అంటూ తన సొంత ఆస్తిలా ప్రకటించుకున్న రెడ్డిగారు అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు. విశాఖ లోక్ సభ సీటును సంపాదించడానికి గత కొంత కాలంగా ఆయన విశేష కృషి చేస్తున్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుత విశాఖ పార్లమెంటు సభ్యురాలు పురందేశ్వరి నరసరావు పేట నుంచి పోటీ చేస్తారనీ, తాను విశాఖ నుంచి బరిలోకి దిగుతాననీ ఆయన చెబుతూ వస్తున్నారు.

నిన్న ఏకంగా పార్లమెంటు హౌస్ లో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ప్రత్యేకంగా కలిసి, తన విశాఖ కృషి గురించి ఆమెకు సవివరంగా తెలియజేశారు. విశాఖలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేబట్టాననీ, పేదల అభ్యున్నతికి తాను ఎంతగానో పాటుపడుతున్నాననీ మేడం గారికి రెడ్డిగారు విన్నవించుకున్నారు. రెడ్డిగారి మనసులో వున్న మాటను గ్రహించిన మేడం మాత్రం ఆయన చెప్పినవి అన్నీ సావధానంగా విని, చిర్నవ్వు నవ్వుతూ 'వెల్ డన్ మిస్టర్ రెడ్డి' అంటూ అభినందించారు. సీటు గురించి మాత్రం మాట ఇవ్వలేదట. మరి ఆ పక్కన వున్నది మామూలు వ్యక్తి కాదు కదా?

  • Loading...

More Telugu News