: ఈ నెల 25 నుంచి కాపు యువతకు కార్పొరేషన్ ద్వారా రుణాలు: చినరాజప్ప


ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25 నుంచి యువతకు మొదటి విడత కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. మొత్తం 20వేల మంది యువతకు రుణాలు అందజేయనున్నట్టు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తుని ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామన్నారు. చంద్రబాబు తలచుకుంటే జగన్ పార్టీ ఖాళీ అవుతుందని చినరాజప్ప హెచ్చరించారు.

  • Loading...

More Telugu News