: రజనీకాంత్ నా టైమింగ్ ను మెచ్చుకున్నారు: సునీల్
ఆర్య చిత్రంలో తాను చేసిన 'పంచింగ్ పద్మనాభం' సీన్ రజనీకాంత్ కు తెగ నచ్చేసిందని హీరోగా మారిన కమెడియన్ సునీల్ తెలిపాడు. ఆయన నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం విడుదలైన సందర్భంగా ఓ టీవీ చానల్ లో నిర్మాత దిల్ రాజుతో కలసి చిట్ చాట్ నిర్వహించిన ఆయన తన పాత జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. ఆర్య చిత్రాన్ని చూసిన రజనీకాంత్, తన టైమింగ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారని తెలిపాడు. కామెడీ నటుడి నుంచి హీరోగా మారడానికి కారణం ప్రజలు చూపిన అభిమానమేనని అన్నాడు. దిల్ రాజు మాట్లాడుతూ, తాను నిర్మాతగా మారకముందే సునీల్ తో పరిచయం ఉందని, తాము అన్నదమ్ముల్లా ఉంటామని అన్నాడు. కృష్ణాష్టమి కథను ఓ పెద్ద హీరో కోసం అనుకున్నామని, ఆ హీరో డెసిషన్ తీసుకోలేకపోయినందునే సునీల్ మనసులో మెదిలాడని చెప్పాడు. ఆపై సునీల్ కు కథ చెబితే, ఎవరితో చేస్తున్నారన్నా? అని అడిగాడని, నీతోనే అని చెబితే కాసేపు ఫ్రీజ్ అయిపోయి ఆపై ఆనందం పట్టలేకపోయాడని, ఇది కలా? నిజమా? అని అడిగాడని చెప్పాడు.