: యాహూ మెయిల్ కూడా జీమెయిల్ లోనే... గూగుల్ కొత్త ఫీచర్!
మీరు ఏ వెబ్ సైట్ లో మెయిల్ ఖాతాను కలిగివున్నా, దాన్ని జీమెయిల్ లో తెరచి చూసుకునే సౌకర్యం దగ్గరైంది. ఈ మేరకు గూగుల్ సంస్థ 'జీమెయిలిఫై' పేరిట సరికొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. దీన్నుంచి యాహూ మెయిల్, ఔట్ లుక్, హాట్ మెయిల్ తదితర ఏ మెయిల్ ఖాతానైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆయా మెయిల్ ఖాతాలను ఒక్కసారి జీమెయిలిఫైకి అనుసంధానం చేసుకుంటే సరిపోతుంది. స్పామ్ నుంచి రక్షణతో పాటు ఇన్ బాక్స్ నిర్వహణ వంటి సదుపాయాలూ ఈ సరికొత్త ఆండ్రాయిడ్ యాప్ లో ఉన్నాయని గూగుల్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఒకసారి అనుసంధానం తరువాత తిరిగి ఎప్పుడైనా వాటిని అన్ లింక్ చేసుకోవచ్చని, ఈ సౌకర్యం లేకుండా కూడా జీమెయిల్ యాప్ వాడుకోవచ్చని తెలిపింది. త్వరలో '...ఎట్ జీమెయిలిఫై డాట్ కాం' పేరిట మెయిల్ సేవలనూ ప్రారంభించనున్నట్టు వివరించింది.