: 'ఫ్రీడమ్ 251' ఆర్డర్ చేస్తే బ్లాంక్ పేజీ వస్తోందా? ఇదిగో ట్రిక్!


ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఫ్రీడమ్ 251' ఫోన్ కోసం ఆర్డర్ చేయాలని భావిస్తే, బ్లాంక్ పేజీ వస్తోందని చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. రూ. 251 మీకు చిన్న మొత్తం కావచ్చు, పెద్ద మొత్తం కావచ్చు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయీ విలువైనదే. ఈ సెల్ ఫోన్ విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నందున అవన్నీ తీరిపోయేవరకూ వేచి చూస్తేనే మంచిది. కాదు, ఇప్పుడే ఆర్డర్ చేద్దామని అనుకుంటే, ఇలా ప్రయత్నించండి. * డైరెక్టుగా 'www.freedom251.com/cart' ఓపెన్ చేయండి. ఈ పేజీ బ్లాంక్ గా కనిపిస్తే పదే పదే 'రిఫ్రష్' చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు ప్రయత్నించిన తరువాత పేరు, చిరునామా తదితర వివరాలు నమోదు చేసుకోవాల్సిన పేజీ వస్తుంది. * మీ వివరాలన్నీ నమోదు చేసిన తరువాత 'ఆర్డర్ నౌ' క్లిక్ చేయాలి. * ఆ తరువాత కూడా బ్లాంక్ పేజీ కనిపిస్తే, తిరిగి పాత పద్ధతే. రిఫ్రష్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి 15 నుంచి 20 సార్లు కూడా రిఫ్రష్ చేయాల్సి రావచ్చు. ఓపికగా ఉండాలి * మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తరువాత కూడా బ్లాంక్ పేజీ కనిపిస్తే, తిరిగి రిఫ్రష్ చేస్తే, మీ ఆర్డర్ సంఖ్య సహా సమాచారం కనిపిస్తుంది. * 48 గంటల్లోగా మీ ఈ-మెయిల్ కు డబ్బు చెల్లించాల్సిన లింక్ పంపుతామని వెబ్ సైట్ చెబుతుంది. * ఇక మీ మెయిల్ ను తరచూ చెక్ చేస్తుండాలి. ముఖ్యంగా జంక్, స్పామ్ ఫోల్డర్లలో చూస్తుండండి. * రింగింగ్ బెల్స్ నుంచి లింక్ వస్తే, దాన్ని క్లిక్ చేసి ఆన్ లైన్లో డబ్బు చెల్లించడం ద్వారా ఆర్డర్ ను పూర్తి చేయవచ్చు.

  • Loading...

More Telugu News