: జాట్ ఆందోళన హింసాత్మకం...కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు


ఆంధ్రప్రదేశ్ లో కాపుల తరహాలో రిజర్వేషన్లు కావాలంటూ హర్యానా లో జాట్ కులస్తులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో నేడు అక్కడ చోటుచేసుకున్న ఘటనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో ప్రజలు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది. రోహ్తక్, భీవానీ ప్రాంతాల్లో జాట్ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకారులు నేరుగా వెళ్లి మంత్రుల నివాసాలను ముట్టడించడమే కాకుండా, వాటిని అగ్నికి ఆహుతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో, హర్యానా ప్రభుత్వం ఇలా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇచ్చింది.

  • Loading...

More Telugu News