: యనమల ఒక చవట, దద్దమ్మ: హర్షకుమార్ ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, యనమల రామకృష్ణుడు ఒక చవట, దద్దమ్మ అని అన్నారు. యనమల వల్లే కాకినాడకు రావాల్సిన పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్టణం తరలిపోయిందని ఆయన ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఇసుకమీదే దృష్టిసారిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీళ్లంతా ప్రజాప్రతినిధులా? లేక ఇసుక వ్యాపారులా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, యనమలపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

  • Loading...

More Telugu News